ప్రపంచంలో అధికంగా ఆముదలను ఉత్పత్తి చేసే దేశాలలో మన దేశం మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆముదం నూనేను అనేక రంగాలలో వినియోగించడం వలన ఈ పంటకు ప్రాధాన్యత కూడా అధికంగానే ఉంది.
ఈ పంటను మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు, కానీ ఖరీఫ్ కంటే రబీలోనే అధిక దిగుబడులను తియ్యవచ్చు.
నేలతయరి
ఈ పంటకు చౌడు నేలలు మరియు మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో తప్ప అన్ని రకాలైన నేలలు అనుకూలమైనవి. విత్తనానికి ముందు నేలను రెండు నుండి మూడు సార్లు నేల వదులుగా అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి రెండు లేదా మూడు టన్నుల పశువుల ఎరువు వేసుకొని నేలలో పూర్తిగా కలిసే విధంగా దున్నుకొని విత్తనం వేయడానికి నేలను సిద్ధం చేసుకోవాలి.
విత్తుకునే విధానం
అధిక దిగుబడుల కోసం సరైన విధాన ఎంపిక చాల ముఖ్యమైనది. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తనానికి ముందు విత్తన శుద్ధి కోసం 1 కిలో విత్తనానికి క్యాప్టన్ 3 గ్రాములు కలుపుకొని విత్తుకోవడం మంచిది. దీనివల్ల మొక్కలకు మొదటి దశలో వచ్చే మొక్కకుళ్ళును నివారించవచ్చు. విత్తనాన్ని విత్తుకునే సమయంలో మొక్కల మధ్య దూరం 45 సెంటి మీటర్లు వరుసల మధ్య దూరం 120 సెంటి మీటర్లుగా ఉండే విధంగా ఈ దూరాలను పాటిస్తూ విత్తుకోవాలి.
పోషకాలను ఎకరానికి 30 కిలోల నత్రజని , 16 కిలోల బాస్వరం మరియు 12 కిలోల పోటాష్ నాలుగు దఫాలుగా వేసుకోవాలి. 1) విత్తుకునే సమయంలో 2) మొక్క వయస్సు 30-35 రోజులకు 3) 60-65 రోజులకు 4) 90-95 రోజుల మధ్య ఈ విధంగా వివిధ దశల్లో వేసుకోవడం వలన మొక్కకు సరైన సమయాల్లో పోషకాలు అంది మొక్క ఏపుగా పెరగడం వలన అధిక దిగుబడులను పొందవచ్చు.
కలుపు యాజమాన్యం
విత్తనం నాటిన 48 గంటల వ్యవధిలో పెండిమిథాలిన్ 5 ml ఒక లీటర్ నీటిలో కలుపుకొని నేల పూర్తి తదిచేలా పిచికారి చేసుకోవాలి. లేని సమయంలో 30 రోజుల లోపు అంతరకృషి ద్వారా కలుపుని తొలగించాలి.
నీటి పారుదల
విత్తుకున్న తరువాత రోజు నీటిని అందివ్వాలి. నెలయొక్క స్వభావాన్ని బట్టి ఇసుక నెలలు మరియు ఎర్ర నేలలు అయితే 7-10 రోజులకు ఒక్క సారి, నేల్లరేగడి మరియు తేమ గల నేలలు అయితే 12-15 రోజులకు ఒక్క సారి నీటి అందివ్వాలి. పూత మరియు కాత సమయాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
డ్రిప్ పద్ధతిని వినియోగిస్తున్నప్పుడు 3-4 రోజులకు ఒక్క సారి నీటిని అందివ్వాలి.
తెగుళ్ళు మరియు చీడ పీడలు
రసం పీల్చు పురుగు
రసం పీల్చు పురుగు నివారణ కోసం ప్రోఫినోఫాస్ 2 ML 1 లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
కాయ తొలుచు పురుగు
ప్రోఫినోఫాస్ 2 ML 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.