జామతోట సాగు చేయుటకు అన్ని రకాలైన నేలలకు అనువైనవి. తక్కువ పెట్టుబడితో కూడిన పండ్లతోట అని చెప్పుకోవచ్చు. తోట నాటిన సంవత్సరం నుండే దిగుబడి మొదలవుతుంది. మొదటి దిగుబడితో పెట్టిన పెట్టుబడిని పొందే అవకాశం ఉంటుంది. నేల యెక్క స్వభావాన్ని బట్టి మరియు మార్కెట్ అందుబాటును దృష్టిలో ఉంచుకొని మొక్క యొక్క రకాలను ఎంచుకోవలసి ఉంటుంది.
జామ మొక్కలు నటుకునే విధానం
గతములో జామతోట రైతులు మొక్కలను ఒక్క ఎకరానికి 200 నుండి 300 మొక్కల వరకే నటుకునే వారు కానీ ప్రస్తుతం పూర్తి అవగాహనా మరియు తోటలపై ఇతర ప్రయోగాలు సఫలిక్రుతం కావడముతో అధిక దిగుబడులకోసం రైతులు అధిక సాంద్రత పద్ధతి ద్వారా ఒక్క ఎకరానికి 2000 మొక్కల వరకు నాటుకోవడం జరుగుతుంది. తోట జీవితకాలం ఎక్కువ ఉండాలని బావించే రైతులు భూమి స్వభావాన్ని బట్టి మొక్కలు నటుకొనే దూరాలను నిర్ణయించుకోవలసి ఉంటుంది.
మొక్కల మధ్య దూరం 5 అడుగులు, సాలుల మధ్య దూరం 10 అడుగుల దూరాలు తీసుకున్నపుడు ఎకరానికి 800 మొక్కల వరకు అవసరం పడుతుంది.
మొక్కల మధ్య దూరం 4 అడుగులు, సాలుల మధ్య దూరం 8 అడుగుల దూరాలు తీసుకున్నపుడు ఎకరానికి 1000 మొక్కల వరకు అవసరం పడుతుంది.
అధిక సాంద్రత పద్ధతి ద్వారా తోటను సాగు చెయ్యాలని బావించే రైతులు మొక్కల మధ్య దూరం 3 అడుగులు, సాలుల మధ్య దూరం 4 నుండి 5 అడుగుల దూరాలు తీసుకున్నపుడు ఎకరానికి 2000 నుండి 2500 మొక్కల వరకు అవసరం పడుతుంది. కానీ ఈ అధిక సాంద్రతలో సాగు చేసే జమతోట వయస్సు తక్కువ కాలపరిమితిలో సాగు చెయ్యాలని బావించే రైతులు ఈ పద్ధతిని ఎంచుకోవడం మంచిది చెప్పుకోవచ్చు.
మొక్కలు నాటుకునే సమయములో గుంతలో 2 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేప పిండి కలిపి వేసుకొని మొక్కను నాటుకోవాలి.
నీటి యాజమాన్యం
నేల యొక్క స్వభావాన్నిబట్టి నల్లరేగడి నేలలు కలిగిన తోటలకు 10 రోజులకు ఒక్కసారి, ఇతర నేలలకు 7 రోజులకు ఒక్కసారి, వేసవి కాలములో 4-5 రోజులకు ఒక్కసారి నీటి అందిచావలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతి ఉపయోగించడం మంచిది దీనిద్వారా మొక్క నుండి మరొక్క మొక్కకి నీరు ప్రవహించకుండా ఉంటుంది కాబట్టి ఎండుతేగులు ఇతర చిడపిడలు వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
కలుపు నివారణ
మొక్కలు నాటుకునే సమయములో మల్చింగ్ కవర్ పరుచుకోవడము ద్వారా కలుపుని నివారించవచ్చు. మొక్కలు నాటిన 3 నెలల వరకు కలుపు నివారణ రసాయనాలను పిచికారి చెయ్యకపోవడమే మంచిది ఇది మొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కావున సాలుల మధ్యలో నాగళ్ళతో దున్నుకొని మొక్కల పాదుల వద్ద మనుషుల సహాయముతో కలుపు తొలగించడము మంచిది.
అధిక దిగుబడులకోసం పాటించవలసిన పద్ధతులు
- మొక్కలు నాటిన 8 నెలల నుండి ఒక్క సంవత్సరం లోపు పూత మొదలవుతుంది. కావున మొక్క బలమైన ఎదుగుధలకోసం మొదటి పూత తొలగించాలి దీని ద్వారా మొక్క కూడా బలంగా ఎదుగుతుంది.
- క్లోనిగ్ పద్ధతి : 4-6 నెలలు ఒక్కసారి మొక్క యొక్క చిగురు కొమ్మలను 50 శాతం వరకు తొలగించాలి. మొక్కపై కాత మరియు పూత లేని సమయములో పూర్తి ఆకులను తొలగించాలి.
- మొక్క 6 అడుగుల ఎత్తు మించకుండా చూసుకోవాలి.
- చిగురు కొమ్మలను తొలగించిన తరువాత కాపరక్సి క్లోరైడ్ మరియు 19:19:19 కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
- జామకాయలు పండు దశకు 10 రోజుల ముందు బోరాన్ పిచికారి చేసుకోవాలి. దీని ద్వారా పండు యొక్క నాణ్యత బాగుంటుంది.
తెగుళ్ళు మరియు వైరస్ నివారణ
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై)
ఈ పండు ఈగ ఆశించాడము ద్వారా 50 శాతం పైగా దిగుబడి నష్టపోయే అవకాశము ఉంది కావున దీని నుండి నివారణగా లింగాకర్షక బుట్టలు (ఎర బుట్టలు) ఎకరానికి 10-15 తోటలో అమర్చుకోవలసి ఉంటుంది. జామకాయలు నిమ్మకాయ పరిమాణములో ఉన్న సమయములో ఫ్రూట్ కవర్లను అమర్చుకోవాలి. దీని ద్వారా పండు ఈగ నుండి నష్టనివరణతో పాటుగా పండు యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. పండు ఈగ ఉదృతి ఎక్కువగా ఉన్న సమయములో మాలాథియాన్ 2 ml. ఒక్క లీటర్ నీటికి (లేదా) డైకమేత్రిన్ 5 ml. ఒక్క లీటర్ నీటికి (లేదా) వేపనునే 3 ml. ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. పండు ఈగ పండులోనే గుడ్లు మరియు లార్వలు పండులోనే అభివృద్ధి చెందుతాయి కావున పండు ఈగ ఆశించి నేల రాలిన పండ్లను పంట తోట నుండి దూరంగా వెయ్యాలి. నేలలో కలిసిపోయిన గుడ్లను మరియు లార్వాలను పూర్తిగా నాశనము చెయ్యడానికి ఒక్కొక్క మొక్క పాదుల వద్ద 20-40 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుల్లికలు వేసుకోవాలి.
ఎండుతేగులు
ఈ ఎండుతేగులు వర్షాకాలము ఆరంభములో ఆశిస్తుంది. ఈ తెగులు మొక్క ఏ దశలో ఉన్న కూడా ఆశించి 25 రోజుల వ్యవధిలో చెట్టు ఎండిపోయి మరణించడం జరుగుతుంది. ఎండుతేగులు ఆశించిన మొక్కలను కాపాడటం కష్టం కావున ఇందుకోసం ముందస్తు చర్యగా పశువుల ఎరువు, వేపపిండి మరియు అభివృద్ధి చేసిన ట్రైకో డెర్మ విరిడి కలుపుకొని చెట్టు యొక్క పాదుల వద్ద వేసుకోవాలి. ఈ తెగులు సోకినా చెట్టు చుట్టూ కార్బండిజం 1 గ్రాము (లేదా) కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని చెట్టు చుట్టూ నేల తాడిచేవిధంగా పోసుకోవాలి. మొక్కలు నీటి ఎద్ధడికి గురికాకుండా క్రమ పద్ధతిన నీటిని అందించాలి. ఈ విధంగా ఎండుతేగులు ఆశించకుండా నివారించవచ్చు.
పేను బంక మరియు పిండి నల్లి
పేను బంక మరియు పిండి నల్లి తల్లి పురుగు నేలలో గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు చెట్టు యొక్క కాండం మీదుగా ఆకులను చేరుకుంటాయి. కావున మొక్క కాండం వద్ద రసాయన జిగురు పూయడము ద్వారా ఈ పురుగులు చెట్టు మీదకు చేరుకోలేవు. ఈ పేను బంక మరియు పిండి నల్లి బారిన పడిన మొక్కలపై నివారణ చర్యగా ఎసిఫేట్ 2 గ్రాములు (లేదా) డైమితోయేట్ 2 మీ.లి (లేదా) మేటాసిస్టాక్ 2 మీ.లి ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.