క్యాబేజీని ఉల్లిగడ్డకు ప్రత్యమ్న్యయంగా కూడా ఉపయోగించడం వల్ల ఇది ఉల్లి ధరలు అధికంగా ఉన్న సమయాల్లో క్యాబేజీ ధర కూడా పెరగటం జరుగుతుంది. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతలవారిగా వేసుకోవడం మంచిది. క్యాబేజీ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు.
నేల తయారి
ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. ఉదజని సూచిక (PH విలువ) 5.5 – 6.5 గా ఉన్న నేలలు సాగుకు అనువైనవి. క్యాబేజీ పంట వెయ్యడానికి ఎంచుకున్న నేలను 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పోటాష్ మరియు 40 కిలోల బాస్వరం వేసుకొని చివరి దుక్కిని కలియ దున్నుకోవాలి.
విత్తుకునే విధానం
ఒక్క ఎకరానికి సూటి (దేశవాళి) రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు, సంకర రకం విత్తనాలు అయితే 100-150 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. విత్తేముందు ఒక్క 1 కిలో విత్తనానికి 3 గ్రా” తైరం లేదా 3 గ్రా” కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. నారు పెంచుటకు నారు మడులను నేలకు దాదాపుగా 10 – 15 సెంటి మీటర్ల ఎత్తుగా మడులను చేసుకొని మడులపై అచ్చుగా గీతలు గీసుకొని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పివేయ్యాలి. విత్తనాలకు నీటిని అందించి దానిపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో విత్తుకోవడం మంచిది. ఈ ట్రేలలో విత్తుకోవడం వల్ల నారును ఆకూ తినే పురుగు ఆశించకుండా ఉంటుంది. ప్రతి రోజు నీటిని పైపాటుగా అందించాలి. నేలపై నారును పెంచే క్రమంలో మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
నారును ఆకు తినే పురుగు ఆశిస్తే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2.5 ML” మాలాథియాన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
మొక్కలు నాటుకునే విధానం
నారు వయస్సు 25 – 30 రోజుల మద్య మొక్కలను నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మొక్కలను నాటుకునేప్పుడు సాలుల మద్య దూరం 60 సెం.మీ. మొక్కల మద్య దూరం 45 సెం. మీ. దూరాలు ఉండేలా చూసుకోవాలి. ఎకరానికి 15000 – 18000 మొక్కలు అవసరం పడుతాయి.
నీటి యాజమాన్యం
తేలికపాటి ఎర్రనేలలు లేదా దుబ్బా నేలలో 7 రోజులకు, నల్లరేగడి నేలలు అయితే 10 రోజులకు ఒక్కసారి నీటిని అందిస్తే సరిపోతుంది. పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
కలుపు యాజమాన్యం
ప్రతి పంటలో ఈ కలుపు ప్రధాన సమస్య మొక్కలు నాటిన 24 నుండి 48 గంటల మధ్య ఒక్క ఎకరానికి 1.25 లీటర్ల పెండిమితలిన్ (లేదా) అలాక్లోర్ 1.2 లీటర్ల రసాయనాన్ని ఇసుకలో కలుపుకొని తేమ గల నేల మీద చల్లుకోవాలి. కానీ పిచికారి చెయ్యకూడదు పిచికారి చెయ్యడం వల్ల నాటిన మొక్కలపై ఈ రసాయనం పడి ప్రమాదానికి గురి అవ్వడం జరుగుతుంది.
చిడ పీడలు మరియు తెగుళ్ళు
ఈ పంటకు చిడపిడల బెడద ఎక్కువగానే ఉంటుంది.
రెక్కల పురుగు
ఈ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగంలోకి చేసి ఆకులను తిని వాటిని జల్లెడ వాలే మారుస్తాయి. దీని వల్ల కాయలు చిన్నగానే ఉండిపోతాయి లేదా కాయలు ఉండవు.
నివారణ: ఈ తెగులు తక్కువ మోతాదులో ఉంటె 5% వేప కషాయాన్ని (వేప నునే) పిచికారి చెయ్యాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటె 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ (లేదా) 0.3 మీ. లీ. స్పేనోశాడ్ పిచికారి చేసుకోవాలి.
పెను బంక
పెనుబంక పురుగులు ఆకు అడుగు భాగాముకు చేరి మొక్కలోని రసాలన్ని పిల్చి పంటను నాశనం చేస్తాయి. దీని నివారణకు 1 లీటర్ నీటిలో 2 మీ.లీ మాలాథియాన్ (లేదా) లీటర్ నీటికి 2 మీ.లీ. డైమితోయేట్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
నారు కుళ్ళు తెగులు
నారు యొక్క కాడలు కిందిభాగంలో కుళ్లిపోయి నేలకూలి మొక్కలు చనిపోతాయి. దీని నివారణ చర్యగా నారు మడులను ముందస్తుగా నేలకు కొంచం ఎత్తులో ఏర్పాటు చేసుకొని విత్తనాలను విత్తుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో మొక్కలను పెంచుకోవాలి. ఈ తెగులు ఆశించిన వెంటనే తెగులు బారిన పడ్డ మొక్కలను నారునుండి తొలగించాలి. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
నల్లకుళ్ళు తెగులు
ఈ నల్లకుళ్ళు సోకినా మొక్క యొక్క ఆకులు ముదురు గోధుమ రంగు చుక్కలు ఏర్పడి వాటి పరిమాణం క్రమంగా పెరుగుతు ఆకు మొత్తాన్ని విస్తరించి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 5 మీ. లీ. స్త్రేప్టోసైక్లిన్ ను కలుపుకొని పిచికారి చేసుకోవాలి.