ప్రపంచ వ్యాప్తంగా ఆహార అవసరాలను తీర్చడం లో మొదటి స్థానం లో ఉన్న వరి పంటని పండిచడం లో మన రైతులు సంప్రదాయ పద్ధతులను విడిచి చాల మంది రైతులు తమ తోటి రైతుల సలహాలు మరియు సూచనల మేరకు మోతాదుకు మించి రసాయన ఎరువులు మరియు పురుగు మందులను ఎక్కువగా వాడటం వలన పర్యావరణ సమతుల్యత లోపించడం. అలాగే చిడపిడల్లో (పురుగులు) రసాయనాలను తట్టుకునే సమర్యం పెరగడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు పెరిగి పోతుంది. వరి పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులను పొందు పరచటం జరిగింది.
పాటించాల్సిన మెళకువలు
మీరు వరి పంట వెయ్యాలని ఎంచుకున్న పొలం లో నెల యొక్క స్వభావమును తెలుసుకోవడానికి నెల పరిక్షలు చేపించి భూమి యొక్క లోపాలను చేలుసుకోవడం మంచిది.
వేసవిలో భూమిని లోతుగా దున్ని దుక్కిని ఎండపెట్టుకోవాలి.
పంట వేసే ముందు జనుము, జీలుగా, పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చిరోట్ట పైర్లను వేసి పూత దశలో బురదలో కలియ దున్ని బురదలో మగ్గనివ్వాలి.
గత పంట అవశేషాలు పూర్తిగా తొలగించాలి.
ఆయప్రాంతలను వాతావరణ పరిస్థితులను బట్టి చీడ పిడలను మరియు తెగుల్లాను తట్టుకునే వరి రకాలను ఎంచుకోవాలి.
నారుమడి సిద్ధం చేసుకునే ముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి.
పొలం గట్లమీద కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి.
భూమి యొక్క స్వభావమును బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి.
అధిక దిగుబడి కోసం తెగులు మరియు పురుగు వ్యాప్తిని మొదటి దశలోనే గుర్తుంచి నివారణ చర్యలు చెప్పటాలి.
సరైన పద్దతిలో నీరు పొలం మడిలో నిలువ ఉండేలా నిటి యాజమాన్య పద్ధతులను పాటించాలి.
సరైన పక్వదశలోకి రాగానే పంట కోతను చేపట్టాలి.
గింజలో తేమ శాతం తక్కువ ఉండేలా ఎండలో ఆరబెట్టాలి.
తేమ శాతం తక్కువ అయినాక ధాన్యాన్ని నిల్వ చెయ్యాలి. ధాన్యాన్ని నిల్వ చెయ్యడానికి గోనేసంచులను మాత్రమే ఉపయోగించాలి.
విత్తే సమయం
నారుమడి సిద్ధం చేసుకునే విధానం
ఎకరాకు 2 గుంటలు లేదా 5 సెంట్ల స్టలన్నీ నారుమడి కోసం సిద్ధం చేసుకోవాలి. 20-24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి.
విత్తనం వేసే సమయం లో ఎకరా నారుమడిలో యూరియా 2.5 కిలోలు + సింగిల్ సూపర్ పాస్పేట్ 6.5 కిలోలు + మ్యురేట్ ఆఫ్ పోటాష్ 1.75 కిలోల మొత్తాన్ని సిద్ధం చేసుకున్న నారుమడి దుక్కిలో వేసుకోవాలి.
చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో సింగిల్ సూపర్ పాస్పేట్ రెట్టింపు మోతాదులో వెయ్యాలి.
2.5 కిలోల యూరియా విత్తిన 12-14 రోజులలోపు వెయ్యాలి.
నారుమడిలో ఊద నిర్మూలనకు బ్యుటా క్లోర్ 50ml/10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 7-9 రోజుల్లో లేదా సైహలోపాస్-పి-బుటైల్ 20ml/10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 14-16 రోజుల్లో మడిలో నీటిని తీసివేసి పిచికారి చెయ్యాలి.
రబీలో చలి వలన జింక్ లోప లక్షణాల సవరణకు జింక్ సల్ఫేట్ 20గ్రా”/10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చెయ్యాలి.
నాటు కోసం పొలాన్ని సిధం చేసుకునే విధానం
వరి నారు వయస్సు 25 నుండి 30 రోజులు మించకుండా చూసుకోవాలి. ఈ మద్య కాలంలో పొలంలో వేసిన నారు మొదటి ఎదుగుదల బాగుంటుంది.
ఒక్కవేళ నాటు వెయ్యడం అలస్యమైనప్పుడు నారు కొనలను త్రుంచి నాటు వెయ్యాలి.
వివిధ తెగుళ్ల నివారణకు పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
నాటు వేసే ముందు రెండు నుండి మూడు సార్లు వారం రోజుల వ్యవధిలో పొలాన్ని దమ్ము చెయ్యాలి. ఎలా చేస్తే కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చెయ్యవచ్చు.
బురద పొలం చివరి దమ్ములో ఎకరానికి ఒక్క బస్తా D.A.P (50 కిలోలు) + యూరియ 10 కిలోలు + మ్యూరేట్ ఆఫ్ పోటాష్ 1౦ కిలోలు చేసి నాటు వెయ్యడం చేపట్టాలి.
నత్రజని ఎరువును యూరియ రూపంలో పైరు ఎదుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు బురద పదనులో వెయ్యాలి.
పైరు 50 – 60 రోజుల మద్య వయస్సులో 50 కిలోల యూరియలో మ్యూరేట్ ఆఫ్ పోటాష్ 15 కిలోలు కలుపుకొని తప్పని సరిగా వెయ్యాలి.
తెగుల్లకు వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన పురుగు మందులను మాత్రమే ఉపయోగించాలి.
చీడ పీడల యాజమాన్యం
వేసవిలో దుక్కులను లోతుగా వేసుకోవాలి.
నెలకు అనువైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
(సుడిదోమ, ఉల్లికోడు, అగ్గితెగులు) లాంటి చీడపీడలనుతట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.
పురుగు మదులపై ఆధారపడి సేద్యం చేయ్యరాదు. ముందస్తు ఎంపిక ముఖ్యం.
నాటు వెయ్యడం ఆలస్యం కాకుండా చూసుకోవాలి.
సుడిదోమ ఆశించిన ప్రాంతాలలో కాలి బాటలు వెయ్యడం తప్పనిసరి.
Half acre land.
Any crops which can be harvested within 60days.
Leafy Vegetables
Coriander, Fenugreek Etc are most convenient If irrigation is available