పసుపు సాగు విధానం (Turmeric Cultivation in Telugu)

నేల తయారి 

పసుపు పంట కోసం  ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని  పాటించాలి. 

విత్తనశుద్ది 

మన రైతు సోదరులు చాల మంది  పసుపు విత్తన శుద్ధి పాటించకపోవడం వల్ల పంట దిగుబడిలో చాల వరకు కోల్పోవడం జరుగుతుంది. విత్తనశుద్ధి చెయ్యడం వలన దుంప కుళ్ళు తెగులును చాల వరకు నివారించవచ్చు.  

విత్తన శుద్ధి చేసే విధానం విత్తనం వేసే ముందు డైమితోయేట్ 2 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ / 1 లీటర్ నీటికి కలుపుకొని 30 నిమిషాలపాటు ఈ ద్రావణంలో పసుపు దుంపలను ఉంచిన తరువాత విత్తుకోవాలి. 

పోషక ఎరువులు (నాణ్యమైన గడ్డ కోసం)

  • పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10-15 టన్నుల వేసుకొని దుక్కి చేసుకోవాలి.
  • పశువుల ఎరువు వెయ్యలేకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకొని వేసుకోవాలి. 
  • చివరి దుక్కిలో జింక్ సాల్ఫేట్ వేసుకోవాలి.
  • పసుపు నాటుకున్న 35-40 రోజుల మధ్య ఎకరానికి  50 కిలోల యూరియ మరియు 200 కిలోల వేపపిండి రెండు కలుపుకొని వేసుకోవాలి.
  •  

కలుపు నివారణ చర్యలు

పంట వేసే ముందు వేసవిలో లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల కలుపు విత్తనం చాల వరకు నాశనం అవుతాయి. 

విత్తనం నాటిన మరుసటి రోజు అట్రజిన్ ౩ గ్రా” / 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

విత్తనం వేసిన 16-18 రోజుల తరువాత మొలకెత్తుతాయి కావున విత్తిన 7-8 రోజులలోపు పండ్లగోర్రుతో పైపాటుగా తిప్పాలి. 

తెగుళ్ల నివారణ

పసుపు పంటకు ఎక్కువగా వచ్చే తెగుళ్ళు దుంపకుళ్ళు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు (తాటాకు తెగులు) వీటి వల్ల పంట దిగుబడి చాలావరకు కోల్పోయ్యే ప్రమాదము ఉంది.

ఆకుమచ్చ తెగులు (తాటాకు తెగులు)

ఈ ఆకుమచ్చ తెగులు గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంది సూర్యరశ్మి తక్కువ ప్రసరించినప్పుడు, వర్షాలు ఏకధాటిగా కురిసినప్పుడు ఈదురుగాలులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు వల్ల ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడుతాయి. అవి మెల్లమెల్లగా మచ్చల పరిమాణం పెరుగుతూ ఆకు మొత్తం విస్తరించి ఆకు పూర్తిగా ఎండిపోతుంది. ఈ తెగులు సోకినా మొక్కల ఆకులను పంటచేను నుండి తొలగించి మంటలో కాల్చి చెయ్యాలి. ఎలా చేయడం వల్ల మిగిలిన మొక్కలకు తెగులు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. 

నివారణ చర్యలు

పైరక్లోస్ట్రోబీన్ 20% WG ఐ మీ.లీ / 1 లీటర్ నీటికి

లేదా

టేబుకొనజోల్ 50% + ట్రీఫ్లొక్షిస్ట్రోబీన్ 25% WG 2 గ్రా” / 1 లీటర్ నీటికి

లేదా

థియోఫనేట్ మిథైల్ 70% WP 1.50 గ్రా” / 1 లీటర్ నీటికి

లేదా

హెక్షకొనజోల్ 5% SC 2 మీ.లీ / 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

దుంప కుళ్ళు తెగులు

ఈ దుంప కుళ్ళు తెగులు పసుపు పంట దిగుబడిని చాల వరకు దేబ్బతిస్తుంది. ఇది పంటచేనులో మురుగు నీరు కానీ, ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిలో ఈ తెగులు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది కావున ఆ నీటిని తొలగించాలి. దుంప ఊరే సమయాల్లో వర్షాలు పడ్డ కూడా మట్టిలో తేమశాతం ఎక్కువ ఉండటం వల్ల సులువుగా వ్యాప్తి చెందుతుంది. విత్తనం వితుకున్కే ముందు విత్తనశుద్ది చెయ్యడం మంచిది. సరైన సమయాల్లో పోషక ఎరువులను అందించాలి.

నివారణ చర్యలు

మేటాలాక్సిల్ 2 గ్రా. లేదా రిడోమిల్ 2 గ్రా. 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు వద్ద నేల తడిచేల పొయ్యాలి.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *