సన్నారకం వడ్ల గురించి పూర్తి వివరాలు, పంట దిగుబడి మరియు గుణాలు తెలియపరచానైంది.
BPT సన్నాలు
వరి రకం పంట కాలం ప్రతేకత దిగుబడి
BPT-5204
(సాంబ మషూరి)150 రోజులు చీడ పీడలను తట్టుకునే గుణం చాల తక్కువ 28 క్వింటాల వరకు
JGL సన్నాలు
వరి రకం పంట కాలం ప్రతేకత దిగుబడి
JGL-11470 (జగిత్యాల మషూరి) 130-140 రోజులు నూక శాతం తక్కువ, ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కాండం దృడంగా ఉండటం వల్ల పంట నేలకులదు. 28 క్వింటాల వరకు
JGL-384
(పొలస ప్రభ)135 రోజులు సాంబ మషూరి వడ్లని పోలి ఉంటుంది. ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. 28-30 క్వింటాల వరకు
JGL-11727 (ప్రాణహిత) 135-145 రోజులు ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఎత్తు ఎక్కువ పెరుతుంది. కావున నత్రజని ఎరువులను ఆదికాండ వెయ్యకూడదు. 30-32 క్వింటాల వరకు
JGL-1798 135-140 రోజులు ఉల్లికోడు మరియు అగ్గితెగులు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. 28-30 క్వింటాల వరకు
WGL సన్నాలు
వరి రకం పంట కాలం ప్రత్యేకత దిగుబడి
WGL-44 (సిద్ది) 140-145 రోజులు ఉల్లికోడు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. 30 క్వింటాల వరకు
WGL-32100 (వరంగల్ సన్నాలు) 135 రోజులు సాంబ మషూరి వడ్లని పోలి ఉంటుంది. ఉల్లికోడు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. 28 క్వింటాల వరకు
WGL-40
(వరంగల్ సాంబ)
135-140 రోజులు
WGL-347 (సోమనాథ్) 135-140 రోజులు
RNR సన్నాలు
వరి రకం పంట కాలం ప్రత్యేకత దిగుబడి
RNR-15048 (తెలంగాణ సోన) 135-140 ఈ రకం వడ్లు అతి సన్నగా ఉంటాయి. తక్కువ నత్రజని అవసరమవుతుంది. అగ్గితెగులు మరియు కాండం తొలుచు తెగుల్లాను తట్టుకోలేదు. 28-30 క్వింటాల వరకు
KNM సన్నాలు
వరి రకం పంట కాలం ప్రత్యేకత దిగుబడి
KNM-733 (కునారం రైస్-1) 130 రోజులు 28 క్వింటాల వరకు
KNM-118 (కునారం సన్నాలు) 130-140 రోజులు సుడిదోమ, అగ్గితెగులును తట్టుకోగలదు. 28-30 క్వింటాల వరకు
KPS సన్నాలు
వరి రకం పంట కాలం ప్రత్యేకత దిగుబడి
KPS-2874 140-145 రోజులు చౌడు నేలలలో కూడా పండగలదు. దోమపోటు తెగులును తట్టుకోలేదు 28-30 క్వింటాల వరకు
MTU సన్నాలు
వరి రకం పంట కాలం ప్రత్యేకత దిగుబడి
MTU-1060 (ఇంద్ర) 150-155 రోజులు సుడిదోమ, అగ్గితెగులు, ఎండకు తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఎత్తు ఎక్కువ పెరిగిన కుడా కాండం దృడంగా ఉండటం వలన పంట పడిపోకుండా ఉంటుంది. నత్రజని ఎరువులు ఎక్కువ అయితే పంట గాలులకు నేలకులే అవకశాలు ఎక్కువ. 28 క్వింటాల వరకు
Supper
Kps 2874
I need 30kgs of KPS 2874 paddy seed.
Kps 2874 I want to one packet