మిరపను మన తెలుగు రైతులు ఎర్రబంగారంగా పిలిచుకుంటారు. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే సంపద కుడా ఆ స్థాయిలో ఉంటుంది.
నేల తయారి
మిరప పంటకు ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు అనువైనవి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరోట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియ దున్నాలి. దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్ తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 2-౩ సార్లు దున్నుకోవాలి.
నారు పెంచే విధానం
నారు పెంచడానికి నేలకు కొంచం ఎత్తులో మట్టిని బెడ్లుగా చేసుకోవాలి. నాలుగు మూలాలు సమన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమడిలో విత్తనాల మధ్య దూరం ఒక్క అంగుళం ( ఒక్క ఇంచు) దూరం ఉండేలా వేసుకోవాలి. సేల్టర్ లో నారు వెయ్యనివారు నారు మొక్కలకి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులగా పైన వేసుకోవాలి. మొక్క వయస్సు 35 -40 రోజుల మధ్యలో మొక్కలను నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.
మొక్కలను నాటుకునే విధానం
మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు మొక్కల సాధారణ దూరాలు 24 x 24 అంగుళాలు (ఇంచులు), లేదా 26 x 26 అంగుళాలు, లేదా 28 x 28 అంగుళాల దూరం నేల స్వభావాన్ని బట్టి దురాన్ని ఎంచుకొని రెండువైపులా అచ్చులుగా దునుకోవాలి. ఇలా రెండువైపులా అచ్చులుగా వెయ్యడం వల్ల మొక్కల మధ్య సమాన దూరాలు, కలుపు యంత్రాలు లేదా కలుపు నాగలి అనువుగా ఉండడం వల్ల కూలీల వినియోగం తగ్గుతుంది. అలాగే మొక్క ఎదుగుదలకు కూడా బాగుంటుంది. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రతగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం 30 – 45 సే.మీ దూరం అనువైనది.
కలుపు యాజమాన్యం
మిరప పంట దిగుబడి తగ్గించడానికి కలుపు పెద్ద సమస్య. కలుపు నివారణకు మొక్కలు నాటిన 20-25 రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి దున్నాలి ఎలా మొక్క నేలమొత్తన్ని కప్పివేసేవరకు 4-5 సార్లు దున్నాలి. కలుపు గొర్రు లేదా గుంటుకల వల్ల మొక్క వేర్లు నేలలోకి విస్తరించి మొక్క ఎదుగుదల బాగుంటుంది. రెండువైపులా సాల్లుగా మొక్కలు నాటుకున్న వారికీ మొక్కల మధ్య ఉన్న కలుపు కూడా పోవడం వల్ల కలుపు కూలీల వినియోగం తక్కువగా ఉండటం జరుగుతుంది.
కలుపు నివారణకు రసాయనాలు మొక్కలను నటుకునే 1-2 రోజుల ముందు పెండిమిథాలిన్ 1.5 మీ.లీ/ 1 లీటర్ కలుకొని పిచికారి చేసుకోవాలి. పంటలో కలుపుమొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తరువాత క్వైజాలోఫాస్ ఇథైల్ ఎకరానికి 400-500 మీ.లీ మొక్కలపై పడకుండా జాగ్రతగా పిచికారి చెయ్యాలి.
డ్రిప్ ద్వారా పంటకు సాగు చేసినప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగించడం వల్ల కలుపును నివారించవచ్చు.
పోషక యాజమాన్యం
మొక్కలను నాటిన 20-25 రోజులలోపు ఎకరానికి నత్రజని 120 కిలోలు, భాస్వరం 24 కిలోలు మరియు పోటాష్ 48 కిలోలు కలుపుకొని వేసుకోవాలి. మొక్క పెరుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందించాలి. పూత మరియు కాయ నాణ్యత కోసం పోటాష్ ను 2-౩ సార్లు అందిచాలి. వర్షాలు ఎక్కువగా పడుతున్నపుడు మొక్కలు నేలనుండి పోషకలను తీసుకోలేవు కాబట్టి 13.0.45 లేదా 19.19.19 ఎరువును 8 గ్రా’/ 1 లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి.
తెగుళ్ల నివారణ
పొగాకు లద్దెపురుగు
మిర్చి పంట దిగుబడి తగ్గడానికి ఈ పొగాకు లద్దె పురుగు ముఖ్య కారణం. ఈ పురుగు సాయత్రం మరియు రాత్రి సమయాల్లో మొక్క యొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. కావున నివారణ కోసం రసాయన మందులను సాయంత్రా సమయాల్లో పిచికారి చెయ్యడం మంచిది.
నివారణ చర్యలు
నోవాల్యూరాన్ 10% EC 1 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా లూఫేన్యురాన్ 5.4% EC 1.25 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా థాయోడికార్బ్ 75% WP 1.5 గ్రాము / 1 లీటర్ నీటికి కలుపుకొని 20-25 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చెయ్యడం ద్వారా పొగాకు లద్దెపురుగు పూర్తిగా నివారించవచ్చు.
నారుకుల్లు తెగులు
నారుకుళ్ళు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సి క్లోరైడ్ ౩ గ్రా’ లేదా రిడోమిల్ MZ 2 గ్రా’ 1 లీటర్ నీటికి కలుపుకొని నారుమడులపై పోసుకోవాలి.
రసంపిల్చు పురుగు ( పెనుబంక )
మొక్కలను భూమిలో నాటుకునే ముందు మొక్క యొక్క వేర్లను ఇమిడాక్లోప్రిడ్ 0.5 మీ.లీ. + కార్బెండిజం 1 గ్రా’ 1 లీటర్ నీటిలో కలుపుకొని 2-౩ నిమిషాలు ఈ ద్రావణంలో నానపెట్టిన తరువాత మొక్కలను నాటుకోవాలి.
వేరు పురుగు
మొక్క నాటుకు ముందు చివరి దుక్కిలో కార్బోఫ్యురాన్ ౩g గుల్లికలను ఎకరానికి 10-12 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ తెగులు మొదటిసారి పంట వెయ్యడం లేదా చాలాకాలం తరువాత బీడు భూమిగా ఉండిపోయిన తరువాత మళ్ళి పంటసాగు చేస్తున్నపుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు
కాపర్ ఆక్సిక్లోరైడ్ ౩ గ్రా’ + స్త్రెప్టోసైక్లిన్ 1 గ్రా’ 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చెయ్యాలి.
ఆకుముడత తెగులు
ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మీ.లీ. లేదా డైఫెన్ తురాన్ 1.5 గ్రా’ 1 లీటర్ లో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
చాలా మంచి సమాచారం రైతుకు చాలా ఉపయోగకరం
త్రిప్స్ మైట్స్ తామర పురుగులు నివారణ గురుంచి తెలియ చేయాలి
నల్లి బాగా ఉంది ఏ మందులు వాడాలి అలాగే పూత పిందా బాగా రావాలి
త్రిప్స్ ,మైట్స్ గురించి చెప్పా గలరా
నమస్కారం సార్ మిరప్ప పూత దిగుమతి ఏమేమి వాడాలి
మిరప నారుకి గోపిలా బెడదా ఎక్కువగా ఉంది నివారణ మార్గం చెప్పండి
Mirapa January lo sagu cheyya vachha
After trips what we have to spary for babuuls on leafs
GOOD INFORMATION SIR