నేల తయారీ
మొక్కజొన్న పంట అన్ని నేలలో అనువైనది నేలలో సాధారణ ph ఉన్నాకూడా సరిపోతుంది. మొక్కజొన్న వరుసగా రెండు పంటలుగా వెయ్యరాదు పంట మార్పిడి పద్ధతులను అవలంబించడం మంచిది. ఇలా పంట మార్పిడి వల్ల అధిక దిగుబడి రావడం, కలుపు నిర్ములన మరియు తెగుళ్ళు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎరువులు వేసి నేల మొతాన్ని ట్రాక్టర్ తో కలియదున్నాలి. కలుపును కొంతవరకు నిర్మూలించడానికి మరియు నేల వదులు కావడానికి కల్టివేటర్ తో 2-3 సార్లు నేల మొత్తం దమ్ము చెయ్యాలి.
వాతావరణ పరిస్థితులు
మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉంటె అన్ని కాలాలకు అనువైన పంట అని చెప్పుకోవచ్చు. కానీ కరిఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను వెయ్యడానికి రబీ సీజన్ లో వెయ్యడానికి మన రైతులు మొగ్గుచుపుతున్నారు. పంట చేతికి అందే వరకు వేసవి కాలం వస్తుండటంతో ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉండటం వల్ల కూడా రైతులకు రబీ పైనే నమ్మకం అని చెప్పుకోవచ్చు.
విత్తనం విత్తుకునే విధానం
విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30-45 సే.మీ మరియు సాలు విత్తనాల మధ్య 20-25 సే.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనంతోపాటు పైపాటుగా యూరియాను వేసుకోవాలి.
నీటి పారుదల
మొక్కజొన్న అధిక దిగుబడులకోసం నీటిని వినియోగం ఎక్కువగా ఉంటుంది. కరిఫ్ సీజన్ లో వర్షాధార పరిస్తితుల వల్ల పంటకు నీటిని పారించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రబీలో 5-7 రోజులకు ఒక్కసారి నీటిని అందించాలి. నేలలో తేమ ఎక్కువగా ఉంటె మొక్క యొక్క అభివృద్ధి బాగుంటుంది.
తచీడపిడలు మరియు తెగుళ్ల నివారణ
కత్తెర పురుగు (Army Worms)
కత్తెర పురుగు పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి లేనిచో కత్తెర పురుగు చాల తక్కువ వ్యవధిలో పంట మొతాన్ని ఆకులు లేని అస్తిపంజరంలా తయారు చేస్తుంది. రైతులు అజాగ్రత్తగా ఉంటె ఈ కత్తెర పురుగువల్ల పంటదిడుబడిలో 90% వరకు నష్టపరిచే అవకాశాలున్నాయి. నివారణ కోసం రసాయన మందులను పిచికారి చేసేప్పుడు ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయాల్లో చెయ్యడం మంచిది.
కత్తెర తెగులు సోకినా పంట
నివారణ చర్యలు
రసాయన మందులను పిచికారి చేసేప్పుడు ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయాల్లో మాత్రమే చెయ్యాలి. 1 లీటర్ నీటిలో 5 మీ.లీ వేపనునే కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా 1 లీటర్ నీటిలో 3 మీ.లీ స్పెనోశాడ్ లేదా ఇమమెక్టిమ్ బెంజోయేట్ 4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చెయ్యాలి.
కాండంతొలుచు పురుగు (Pink stem borer)
కాండంతొలుచు పురుగు ఎక్కువగా రబీ (శీతాకాలం) సీజన్ లో దీని వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ పురుగు వల్ల పంట 65% వరకు దిగుబడి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పురుగు మొక్క యొక్క కాండంపై మరియు మొక్కజొన్న పొత్తు (కంకి) లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.
కాండంతొలుచు తెగులుగు సోకినా పంట
నివారణ చర్యలు
మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ 1 లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కాండంతొలుచు తెగులు ఉధ్రుతి ఎక్కువగా ఉంటె కర్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోలు మొక్కజొన్న మొగిల్లలో(ఇగురు) లో వేసుకోవాలి.
పేనుబంక
మొక్కజోన్నలో పేనుబంక రసంపీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి వాతావరణంలో మరియు మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పెనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క నిరసనగామరి ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మరుతాయి.
నివారణ చర్యలు
మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
ఆకు ఎండు తెగులు
పంటకు ఎండుతెగులు సోకినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకొజేబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
తుప్పు తెగులు
మొక్కజొన్న తుప్పు తెగులు నివారణ కోసం మాన్కోజెబ్ 2.5 గ్రాములు 1 లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
కాండం కుళ్ళు తెగులు
ఈ కాండం కుళ్ళు తెగులు మొక్క పూత దశ నుండి మొదలవుతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల యొక్క కాండలు గోధుమ రంగుకి మారిపోయి, కాండం మధ్య భాగం దుర్వాసన రావడం గమనించవచ్చును. పంటమార్పిడి పద్ధతిని అవలంబించాలి. తేమశాతం ఉండేలా నీటితడులు తిప్పాలి. ఎండకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి.
Good information
Paddy
Very good information
I would like to know that Ambedkar konaseema district East godavari district in Andhra Pradesh, soil is good for fruits and vegetables. Kindly inform me.
Good information