మన దేశంలో ఆహార పంట అయిన వరి పంటకు పోటిగా పండిస్తున్న పంట, పత్తి పంట అనే చెప్పుకోవచ్చు. పత్తి భారతదేశ ముఖ్యమైన కాటన్ ఫైబర్ మరియు నగదు సృష్టించే పంటగా, అలాగే వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థలో అధిక పాత్ర పోషిస్తున్నది.
నేల తయారీ ( క్షేత్ర తయారీ)
పత్తి వర్షాధార పంట కావున జూన్ మొదటి రెండవ వారంలో విత్తనం విత్తేల చూసుకోవాలి. దానికోసం భూమిని సిద్ధం చేసుకునే విధానం.
నేలని ట్రాక్టర్ తో ప్రతి 3 నుండి 4 సంవత్సరాలకు ఒక్కసారి నేలను లోతుగా దున్నాలి. ఎలా చేస్తే కలుపుమొక్కల విత్తనము నాశనం అయ్యి కలుపు తగ్గుతుంది.
ఋతుపవనాలకు ముందు భూమిని ట్రాక్టర్ తో పదేపదే దుక్కి చెయ్యాలి. విత్తనం వేసే ముందు వరకు భూమినిలోని తేమశాతం తక్కువ ఉండేలా దుక్కిని సిద్ధం చేసుకోవాలి.
విత్తే విధానం
ట్రాక్టర్ తో కానీ, ఎడ్ల అచ్చు నాగలితో అచ్చు గీతాలు దున్నుకోవాలి. అచ్చు గీతాల మధ్య దూరం 45 నుండి 60 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. సాలుల మధ్య కలుపు తీయు యంత్రాలు లేదా కలుపు నాగలికి అనువుగా ఉండే దూరాన్ని పాటించాలి.
మొక్కల మధ్య దూరం 30 నుండి 40 సెం. మీ ఉండేలా విత్తనాలను విత్తుకోవాలి. మొక్క ఏపుగా పెరగడానికి మొక్కల మధ్య ఈ దూరం అనువుగా ఉంటుంది.
కీటకాలు తెగుళ్ళు
పేనుబంక (జాసిడ్స్ / అఫిడ్స్ )
మిథైల్ డెమెటన్ లేదా డైమెథోయేట్ 200-250 మి.లీ/ఎకరానికి
గులాబీ పురుగు (గులాబీ తెగులు) (Pink Worm)
ఎండోసల్ఫాన్ లేదా క్లోరోపైరిఫొస్ లేదా క్వినాల్ఫోస్ 1 లీటర్ / ఎకరానికి మరియు HNPV 100 మి.లీ/ ఎకరానికి పై వాటిలో ఏదైనా దీనితో కలిపి పిచికారి చెయ్యాలి.
తెల్లదోమ ( White Fly)
ట్రయాజోఫోస్ 200 – 300 మి.లీ / ఎకరానికి లేదా వేప నూనే 1 లీటర్ / ఎకరానికి పిచికారి చేయాలి.
తామర పురుగు ( త్రిప్స్ )
ఎండోసల్ఫాన్ 500 మి.లీ / ఎకరానికి పిచికారి చెయ్యాలి.
కలుపు యాజమాన్య
పద్ధతులు పత్తి పంటకు పెట్టుబడి పెరుగుటకు కలుపు ఒక్క పెద్ద కారణం. కావున కలుపు నియంత్రణకు విత్తనము విత్తే ముందే జాగ్రతలు తీసుకోవాలి. క్షేత్ర తయారీ సమయం లో దుక్కిని పదే పదే దున్ని తేమ లేకుండా భూమిని ఆరనివ్వాలి. ఎలా చేసే భూమిలో ఉన్న కలుపు విత్తనాలు చాల వరకు నశిస్తాయి.
కలుపు నివారణ కోసం రసాయన మందులు (గడ్డి మందులు) పిచికారి చేయాలనుకుంటే విత్తనం విత్తే ముందే చెయ్యడం మంచిది. పత్తి మొక్కలు ఎదుగుతున్న సమయంలో కలుపు నివారణ కోసం రసాయన మందులు (గడ్డి మందులు) పిచికారి చేస్తే అది మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మొక్కలు ఎదుగుతున్న సమయంలో కలుపు తీయుటకు కలుపు తీయు యంత్రాలు లేదా కలుపు నాగలితో లేదా మనుషుల సహాయంతో కలుపు మొక్కలను తొలగించడం మంచిది.
నీటి పారుదల
మన తెలుగు ప్రాంతాలలో పత్తి పంట వర్షాధార పంట కావున మొదట్లో నీరు పారించే అవసరం ఎక్కువగా ఉండదు. కానీ పత్తి పంట ఎదిగిన కొద్ది నీటి వినియోగం పెరుగుతుంది.
పత్తి పంటకు బిందు సేద్యం (Drip irrigation) చాలా ఉపయోగకారి. ఈ బిందు సేద్యం ద్వారా కలుపు నిర్మూలనకు కూడా ఉపయోగపడుతుంది.
Good app
What is the chemical of cotton Best flowers and growths sir
With organic methods sir