వేరుశనగ సాగు విధానం Groundnut Cultivation in Telugu

నేల ఎంపిక

వేరుశనగ పంట కోసం ఇసుక శాతం ఎక్కువ ఉండి. తేమ శాతం తక్కువగా ఉండే నేలలు చాలా అనువైనది. అలగే నల్లరేగడి నేలలు ఏమాత్రం పనికిరావు. నేల యొక్క PH 6.0 నుండి 6.5 ఉండేలా చూసుకోవాలి. మన తెలుగు ప్రాంతాలలో వర్షపాతం 50 నుండి 125 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది కాబట్టి ఈ వాతావరణం మనకు చాలా అనువైనది అని చెప్పుకోవచ్చు. 

మన తెలుగు ప్రాంతాలలో వేరుశనగ పంటను నలుగు సీజన్లలో విత్తుతారు.

ఖరీఫ్ : వేరుశనగ ఖరీఫ్ సీజన్లో 65% పైగా వర్షాధార పరిస్తితులను బట్టి విత్తుతారు.

రబీ : శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల చాల మరిమితమైన ప్రాంతలో సాగు చేస్తారు. వేరుశనగ పంటకి ఉష్ణోగ్రత 15 ºC కంటే తక్కువ ఉండకూడదు. 

వేసవి : వేరుశనగ పంటని ఈ కాలంలో పండిస్తునప్పుడు నీటిపారుదల 11 నుండి 14 సార్లు ఉండేలా చూసుకోవాలి. 

వసంతం : మనవద్ద మర్చి నుండి మే మద్య కాలంలో పంటని తక్కువ విస్తీర్ణంలో విత్తుకుంటారు. వేసవి మరియు వసంత కాలంలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కావున పంట విస్తీర్ణం తక్కువ.

దుక్కి తయారీ

వేరుశనగ పంట కోసం దుక్కి దున్నేటప్పుడు తక్కువ లోతులోనే దున్నుకోవాలి. ఎక్కువ లోతు దున్నితే పంట కోసేప్పుడు కష్టతరంగా మారుతుంది. అలగే మొక్క ఎక్కువగా పెరుగుతుంది. కాయలు భూమి లోతులో కాస్తాయి. కావున 10 – 16 సెంటిమీటర్ల లోతు వరకు సరిపోతుంది. 

విత్తన శుద్ధి 

మేలు రకం వితనాన్ని ఎంచుకునే విధానంలో మొదటగా వేరుశనగ గింజ పై పొర (తోలు) దెబ్బతిన్న ఉన్న మరియు గింజ రంగు మారిన విత్తనాలను పూర్తిగా తొలగించాలి.

విత్తన వ్యాధులు మరియు తెగుళ్ల నివారణ కోసం వేరుశనగ గింజలను తీరం (3 గ్రా / కేజీ విత్తనాలు), మాంకోజెబ్ (3 గ్రా / కేజీ విత్తనాలు) లేదా కార్బెండజిం (2 గ్రా / కేజీ విత్తనాలు) విత్తనాలకు కలిపి విత్తుకోవాలి.

విత్తనం విత్తుకున్నకా ఎలుకలు, ఉడతలు మరియు పక్షులు చెలక నుండి వేరు చేస్తాయి. అలాంటప్పుడు చేనులో కిరోసిన్, పినెటార్ మరియు ఎండకి మెరిసే కవర్లను ఉంచడం మంచిది. 

విత్తుకునే పద్ధతి

సాధారణంగా వర్షాకాలం జూన్ లోనే మొదలవుతాయి కాబట్టి నీటి సౌకర్యం ఉన్నచోట వర్షాకాలం ముందు మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో భూమిలో తేమ శాతం ఉండేలా వితనాన్ని విత్తుకోవడానికి ఇది సరైన సమయం. జూన్ లోనే మొదటి వర్షాలు మొదలు కావడం వలన అన్ని వితనలు మొలకెత్తడం జరుగుతుంది.

విత్తనం విత్తుకునేప్పుడు మన దేశవాళి నాగలితో విత్తనం లోతు 5 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. సాలుల మధ్య దూరం 30-45 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.  

నీటిపారుదల

వేరుశనగ వర్షాకాలం మొదలు కాకముందే ఎక్కువ వేస్తారు కాబట్టి మొదటిసారిగా 1 లేదా రెండు సార్లు నీటిపారుదల అవసరం అయ్యే అవకాశం ఉంది. ఒక్కవేళ నిరు అందుబాటులో లేకున్నా ఋతుపవనాలు ప్రవేశించే సమయం కాబట్టి నీటి వినియోగం అంతగా ఉండకపోవచ్చు. నీటిపారుదల అందుబాటులో ఉంటె ఉపయోగించుకోండి.  

పుష్పించే సమయంలో నీటి అవసరం ఎక్కువ కావున పంటకి కనీసం 8-10 రోజులకి ఒక్కసారి నీటిపారుదల చేపట్టాలి. ఇది వేసవి సమయంలో అయితే 5-8  రోజులకి ఒక్కసారి అయినా నీరు అందించాలి.

కలుపుయమన్య పద్ధతులు

కలుపు మొక్కలు పంటకు పోటి రావడం వల్ల చేను ఎదుగుదల కష్టతరంగా మారుతుంది. ఈ కలుపు మొక్కల వల్ల పంట దిగుబడి 25 నుండి 50 % వరకు తగ్గే అవకాశం ఉంది. పంట సమయంలో 28 నుండి 42 రోజుల మద్య కలుపు ఏరివేత చేపట్టాలి. 60 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. 

అలాగే వేరుశనగ గింజలు ఏర్పడే సమయంలో పంట మొక్కల వేరు భాగంలో ఉండే మట్టి కదలకుండా జగ్రతపడాలి. అందుకే ఈ సమయానికి ముందే కలుపు మొక్కలు తొలగించాలి. 

చీడపీడల మరియు తెగుళ్ల నివారణ

 

 

వేరుశనగలో దిగుబడి నష్టానికి కారణమయ్యే ప్రధానమైన తెగుళ్ళు 

అఫిడ్స్, జాసిడ్, త్రిప్స్, వైట్ ఫ్లైస్, లీఫ్ మైనర్, వైట్ గ్రబ్, ఆర్మీ వెచ్చని మరియు హెలియోథిస్ మొదలైనవి.

అఫిడ్స్, జాసిడ్లు, త్రిప్స్ మరియు వైట్ ఫ్లైస్ వంటి ప్రధాన రసం పీల్చే తెగుళ్ళు 10 లీటర్ల నీటిలో ౩0 ml  ఫాస్ఫామిడాన్   లేదా 10 లీటర్ల నీటిలో 30 ml  డైమెథోయేట్ లేదా 10 లీటర్ల నీటిలో 25 ml మిథైల్-ఓ-డెమెటన్  లను కలుపుకొని  10 రోజుల వ్యవధిలో రెడుసార్లు పిచికారీ చెయ్యడం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *