MTU దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
MTU-1001 (విజేత) | 135-140 రోజులు | సుడిదోమ, అగ్గి తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. | 30-32 క్వింటాల వరకు |
MTU-1010 (కాటన్ దొర సన్నాలు) | 125 రోజులు | సుడిదోమను తట్టుకుంటుంది. | 30 క్వింటాల వరకు |
MTU-1271 | 140 రోజులు | 30-32 క్వింటాల వరకు | |
MTU-1318 | 145 రోజులు | ఎండకు తెగులును తట్టుకుంటుంది. కాండం బలంగా ఉండటం వలన గాలులలు పంట నేలకులదు. | 30-32 క్వింటాల వరకు |
MTU-1253 | 145 రోజులు | ఈ రకానికి తెగుళ్ళను తట్టుకునే శక్తి ఎక్కువగ ఉంటుంది. గాలులకు పడిపోకుండా కాండం ధృడంగా ఉంటుంది. | 28 క్వింటాల వరకు |
MTU-1315 | 145 రోజులు | ఎండకు తెగులును తట్టుకోగలదు. | 28-30 క్వింటాల వరకు |
JGL దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
JGL-24423 (జగిత్యాల రైస్-1) | 125 రోజులు | సుడిదోమను తట్టుకుంటుంది. ఈ రకం వరి తక్కువ ఎత్తు పెరుగుతుంది. వడ్లు రాలకుండా ఉంటాయి. కావున పంట కోత సమయాల్లో వడ్లు వృధాకాకుండా ఉంటాయి. దీనికి మెడఇరుపు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. కావున | 30-33 క్వింటాల వరకు |
JGL-18047 (బతుకమ్మ) | 120 రోజులు | సుడిదోమను తట్టుకుంటుంది. | 30 క్వింటాల వరకు |
WGL దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
WGL-3962 (భద్రకాళి) | 135 రోజులు | ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది. | 30 క్వింటాల వరకు |
WGL-915 (వరంగల్ రైస్-1) | 135-140 రోజులు | పంట ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది. కావున నత్రజని తగినంత మాత్రమే వేసుకోవాలి. కాండం దృడంగా ఉండటం వలన పంట నేలకులదు. ఈ రకానికి పిలక శాతం తక్కువ కావున నాటును దగ్గర, దగ్గరగా వేసుకోవాలి. | 28-30 క్వింటాల వరకు |
RNR దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
RNR-11718 | 135-140 రోజులు | చౌడు నేలలలో కూడా పండగల సామర్ధ్యం ఉన్న రకం. సుడిదోమ, అగ్గితెగులు, ఎండకు తెగుళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. | 28-30 క్వింటాల వరకు |
BPT దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
BPT-2846 | 140 రోజులు | పంట ఎక్కువ ఎత్తుకు పెరుగుతుంది. కావున నత్రజని తగినంత మాత్రమే వేసుకోవాలి. కాండం దృడంగా ఉండటం వలన పంట నేలకులదు. | 30-32 క్వింటాల వరకు |
IR దొడ్డు రకం
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
IR-64 | 120 రోజులు | పంట కోత సమయాల్లో గింజ రాలదు. | 26-28 క్వింటాల వరకు |
ఇతర రకాలు
వరి రకం | పంట కాలం | ప్రత్యేకత | దిగుబడి |
---|---|---|---|
తెల్ల హంస | 125 రోజులు | ఈ రకం చలిని తట్టుకుంటుంది. చౌడు నేలలలో కూడా పండగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది కావున నత్రజని ఎరువులను తగిన మోతాదులో వేసుకోవాలి. ఈ రకానికి అగ్గితెగులు ఆశించే అవకాశం ఎక్కువ. | 25-27 క్వింటాల వరకు |
ఎర్ర మల్లెలు | 130 రోజులు | మంచి గింజ నాణ్యత కలిగి ఉంటుంది. | 26-28 క్వింటాల వరకు |
Erra mallelu seed