kandi sagu

కంది సాగు విధానం ( Pigeon Pea Cultivation in Telugu )

నేల తయారి

కంది పంట అన్ని రకాలైన నేలలకు అనువైన పంట. ఈ పంటను బీడు భూములలో కూడా దిగుబడి తియ్యవచ్చును. విత్తనానికి ముందు నేల వదులుగా అయ్యేలాగా 2-3 సార్లు దమ్ము చేసుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 2-4 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని (యూరియ), 20 కిలోల భాస్వరం వేసుకొని చివరి దమ్ము చేసి విత్తనానికి సిద్ధం చేసుకోవాలి. 

విత్తుకునే విధానం 

ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తేముందు విత్తన శుద్ధి కోసం ఒక్క 1 కిలో విత్తనానికి  5 ml ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్.ఎస్ లేదా 3 గ్రా” తైరం లేదా 3 గ్రా” కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. పాటించవలసిన దూరాలు మొక్కల మధ్య దూరం 20-25 సెంటి మీటర్లు, సాలుల మధ్య దూరం 90-120 సెంటి మీటర్ల దూరాలు పాటిస్తూ విత్తనాలను విత్తుకోవాలి. 

మొక్కలు ఎక్కువ ఎత్తుగా పెరిగితే మొక్క యొక్క చివర్లను 30 సెంటి మీటర్లు ( 1  అడుగు) పొడవు వరకు చివర్లను కత్తిరించివేయ్యాలి.  

కలుపు యాజమాన్యం 

ఈ పంటకు కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కావున విత్తనం వేసిన 2 రోజుల లోపు పెండిమిదలిన్ లీటర్ నీటికి 5 ml కలుపుకొని నేల మొత్తం తడిచేవిధంగా పిచికారి చేసుకోవలెను. మొక్కలు ఎదుగుతున్న సమయంలో కలుపు నివారణ చర్యగా సాలుల మధ్య గుంటుక లేదా గోర్తతో మొక్కలు నేలను కప్పివేసే వరకు అంతరకృషి చేసుకోవలెను. అయిన కూడా మొక్కల మధ్య కలుపు ఎక్కువగా ఉంటె 1 లీటర్ నీటికి 2 ml క్వేజలోపాస్ కలుపుకొని పిచికారి చెయ్యవలెను. 

నీటి యాజమాన్యం

కంది పంటను మనం ఎక్కువగా వర్షాధార పంటగా వేస్తాం కావున పూత మరియు కాత  సమయాల్లో నీటిని అందిస్తే సరిపోతుంది. కంది పంట నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా పండుతుంది.

తెగుళ్ళు మరియు చిడ పీడలు

ఆకు చుట్టూ పురుగు

redgram pests

ఈ ఆకుచుట్టు పురుగు ఆకులను చుట్టలుగా చుట్టి ఆకుయోక్క పత్రహరితాన్ని పిల్చివేస్తాయి. దీనివల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 1.6 – 2 ml మొనోక్రోటోపాస్  కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

కాయతొలుచు పురుగు ( చెనగా పచ్చ పురుగు )

redgram flower borer
redgram flower borer

ఈ చెనగాపచ్చ పురుగు పూత మరియు కాత సమయాల్లో ఆశిస్తుంది. ఈ పురుగు కాయలకు రంధ్రాలు చేసి లోపల ఉన్న గింజలను తినేస్తుంది. సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దీనివల్ల పంట దిగుబడి చాల వరకు తగ్గుతుంది. మొదట్లో దీని ఉదృతి తక్కువగా ఉన్నపుడు 1 లీటర్ నీటికి 5%  వేప కాషాయం లేదా 5 ml వేప నునే 5 ml కలుపుకొని పిచికారి చేసుకోవలెను. ఈ పురుగు ఉదృతి ఎక్కువగా ఉంటె పూత సమయంలో 2.5 ml క్లోరిపైరిఫాస్. కాయ దశలో 1 లీటర్ నీటికి 2 ml క్వినలోఫాస్ లేదా 1.5 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవలెను. 

ఎండు తెగులు ( వెర్రి తెగులు)

ఈ తెగులు వలన ఎదుగుతున్న మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. ఇలా ఎండి పోయిన మొక్కలను పంటచేను నుండి తొలగించి వెయ్యాలి. దీనివల్ల వేరే మొక్కలకు తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి కాపర్ క్లోరైడ్ లేదా మంకొజేబ్ 3 గ్రాములు కలుపుకొని మొక్కల వేర్లు తడిచేవిధంగా మొక్కల చుట్టూ పోయాలి.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *