మొక్కజొన్న మనదేశంలో ఆహార అవసరాలను తీర్చడంలో వరి మరియు గోదుమల తరువాత మూడవ స్థానం లో పండుతున్న అతిపెద్ద క్షేత్ర పంటగా కొనసాగుతుంది. అందుకనే మొక్కజొన్నను తృణధాన్యాల రాణి అని పిలుస్తారు. తృణధాన్యాలలో జన్యు దిగుబడి సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్నను ఎక్కువ పండిస్తున్న దేశాలలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన మొత్తం మొక్కజొన్నలో 2-3% వాటా భారతదేశానిదే మరియు ప్రపంచంలోని టాప్ -5 మొక్కజొన్న ఎగుమతిదారులలో ఇది ఒకటి. ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసిన మొత్తం మొక్కజొన్నలో దాదాపు 14%. ఆగ్నేయ ఆసియా భారతీయ మొక్కజొన్నకు అతిపెద్ద మార్కెట్, ఎగుమతి చేసిన భారతీయ మొక్కజొన్నలో దాదాపు 80% ఇండోనేషియా, వియత్నాం మరియు మలేషియాకు వెళుతుంది.
మొక్కజొన్న ఉత్పత్తి చేస్తున్న మొదటి 10 రాష్ట్రాలు (వాటా శాతల్లో%)
క్రమ సంఖ్య | రాష్టాల పేర్లు | పంట వాటా శాతల్లో (%) |
1 | కర్ణాటక | 13.61% |
2 | మధ్యప్రదేశ్ | 12.36% |
3 | మహారాష్ట్ర | 12.33% |
4 | తమిళనాడు | 9.19% |
5 | తెలంగాణ | 8.95% |
6 | బీహార్ | 8.43% |
7 | ఆంధ్రప్రదేశ్ | 8.01% |
8 | రాజస్థాన్ | 5.71% |
9 | ఉత్తరప్రదేశ్ | 5.15% |
10 | వెస్ట్ బెంగాల్ | 3.93% |
11 | మిగిలిన మొత్తంరాష్ట్రాల వాటా | 12.33% |
ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి దేశాల వారిగా
క్రమ సంఖ్య | దేశాల పేర్లు | మిలియన్ మెట్రిక్ టన్నులలో |
1 | అమెరికా | 34,58,94,000 |
2 | చైనా | 26,07,70,000 |
3 | బ్రెజిల్ | 10,68,64,000 |
4 | యురోపియన్ యూనియన్ | 6,72,35,000 |
5 | ఆర్జెంటినా | 5,02,35,000 |
6 | భారతదేశం | 4,28,46,000 |
7 | ఉక్రేనియ | 3,69,20,000 |
8 | మెక్సికో | 2,21,68,000 |
9 | సౌత్ఆఫ్రికా | 1,81,97,000 |
10 | రష్యా | 1,66,45,000 |
Narayankhed village
Narayankhed mandal
Sangareddy district
Telangana state