జొన్న సాగు విధానం ( Jowar Cultivation in Telugu )

మన తెలుగు ప్రజలు తెలుపు మరియు పసుపు జొన్నలను మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. ఎర్ర జొన్నలను పశువులకు దానగా ఉపయోగిస్తారు. వేరే దేశాల ప్రజలు ఎర్ర జొన్నలను కూడా ఆహారంగానే వినియోగిస్తున్నారు.

భూమి తయారి

జొన్న పంటను కరిఫ్ మరియు రబీ రెండు కాలాలకు అనువైన పంట. కావున నేలను సిద్ధం చేసుకునే ముందు గత పంట యొక్క వ్యర్ధాలను చేకలు నుండి పూర్తిగా తొలగించాలి. చివరి దుక్కికి ముందు పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసుకొని చివరి దుక్కి వేసుకొని విత్తనం వేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. 

నేల స్వభావం 

ఇసుక నేలలు క్షరత్వం ఎక్కువ ఉన్న నేలలు ( చౌడు నేలలు ) లో పంట దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. మిగిలిన ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు, చౌక నేలలు జొన్న పంటకు అనువైనవి. నల్ల రేగడి నేలలో నీరు నిల్వ ఉండకుండా నేల సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

విత్తన ఎంపిక 

అధిక దిగిబడులకోసం ముందుగా భూమి స్వభావాన్ని, మార్కెటింగ్ ని బట్టి విత్తనాన్ని ఎంచుకోవడం మంచిది. 

  • తెల్ల జొన్నలో CSH – 16 పంట కాలం 105-110 రోజులు పంట దిగుబడి 14-16 క్వింటాల వరకు పొందవచ్చు.
  • నంద్యాల తెల్లరకం జొన్నలు పంటకాలం 95-100 రోజులు పంట దిగుబడి 14-16 క్వింటాల వరకు వస్తుంది.
  • పాలెం-2 పంటకాలం 105-110 రోజులు దిగుబడి 11-13 క్వింటాల దిగుబడి పొందవచ్చు. వెడల్పు ఆకులతో చొప్ప (మొక్క) అధికంగా పెరుగుతుంది.

విత్తుకునే విధానం 

ఒక్క ఎకరానికి 3-4 కిలోల వరకు అవసరం పడుతాయి. విత్తనశుద్ధి కోసం ఒక్క కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మరియు 3 గ్రాముల థయోమితాక్సోం లేదా తైరం లేదా కప్టాన్ కలుపుకొని విత్తనశుద్ది చేసుకోవాలి. విత్తనాల మధ్య దూరాలు సాలుల మధ్య దూరం 45 సెంటి మీటర్లు మొక్కల మధ్య దూరం 12-16 సెంటి మీటర్ల దూరాలు ఉండేలా చూసుకోవాలి. 

పోషక ఎరువుల యాజమాన్యం

ఎకరానికి పంట కాలంలో 28-35 కిలోల నత్రజని + 18 కిలోల బాస్వరం + 12 కిలోల పోటాష్ లు అవసరం పడుతాయి. బాస్వరం మరియు పోటాష్ విత్తనాలు విత్తేముందు పూర్తిగా చివరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసుకొని ఒక్క సగభాగాన్ని విత్తేటప్పుడు మిగిలిన సగభాగాన్ని పంట మోకాలు ఎత్తుకు పెరిగినప్పుడు వేరుసుకుంటే సరిపోతుంది. 

కలుపు నివారణ

విత్తనాలను విత్తిన 2 రోజుల లోపు పెండిమిదలిన్ లేదా అట్రాజిన్ ఒక్క లీటర్ నీటికి 3 మిల్లిలిటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

పక్షుల బెడద

Jonna Panta
jonna crop
  • జొన్న పంటలో తెగుళ్ల కంటే పక్షుల వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. 
  • జొన్న కంకుల మీద పచ్చి కోడి గుడ్ల నీలాన్ని రెండు (2) లీటర్ల నీటికి ఒక్క గుడ్డు చొప్పున కలుపుకొని వారం రోజులకు ఒక్కసారి పిచికారి చేసుకోవాలి.
  • మెరుపు తీగెలు పంట చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి.
  • కంకులకు తొడుగులు ఏర్పాటు చేసుకోవాలి.
  • పంటను రైతులు ఒక్కే వద్ద ఎక్కువ విస్తీర్ణంలో పంటను వెయ్యాలి.
  • ఉదయం మరియు సాయత్రం సమయాల్లో శబ్దాలు చెయ్యాలి.
  • మనిషి రూపం పోలిన బొమ్మలను పంట చేనులో ఏర్పాటు చెయ్యాలి.

తెగులు నివారణ చర్యలు

మొగి పురుగు

జొన్న పంటకు ఎక్కువ ఆశించే తెగులు ఈ మొగి పురుగు ఇది మొక్క ఒక్క మొగికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్క మొగి నుండి లాగినప్పుడు సులువుగా వేరు చెయ్యబడుతుంది. మొగి లోపల కుళ్ళిపోయిన వాసనా రావడం జరుగుతుంది. ఈ తెగులు మొక్క వయస్సు 40 రోజుల లోపు మాత్రమే ఆశిస్తుంది. 

నివారణ చర్యలు 

ముందస్తుగా విత్తనం విత్తుకునే ముందు కార్బొంఫ్యురాన్ గుల్లికలు విత్తనలతోపాటు వేసుకోవాలి. మొక్కలకు ఆశించిన వెంటనే థయోడికార్బ్ ఒక్క లీటర్ నీటికి 1.5 గ్రా. లేదా లామ్దా సైహలోత్రిన్ 2 మిల్లిలిటర్లు ఒక్క లీటర్ కి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

కాండంతొలుచు పురుగు

మొక్క యొక్క కాండం మీద రంధ్రాలు మరియు ఆకుకు అడ్డంగా రంధ్రాలు ఉన్నప్పుడు కాండంతోలుచు పురుగు ఆశించింది అని గుర్తించవచ్చు. 

నివారణ చర్యలు

ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యురాన్ 3G గుల్లికలు మొక్క యొక్క  మొగిల్ల లోపల వెయ్యాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *